ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టొద్దని ఏపీ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టవద్దని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంపై అధ్యయనానికి నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ కమిటీ 4నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో సీఎస్‌పై కోర్టు ధిక్కార చర్యలు అవసరం లేదని.. నిబంధనలు ఉల్లంఘించి నిర్మిస్తే ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.







