TS News: వేములవాడకు పోటెత్తిన భక్తజనం.. దర్శనానికి ఐదున్నర గంటల సమయం

వేములవాడ (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి స్నానాలు ఆచరించిన భక్తులు దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. దర్శనానికి సుమారు ఐదున్నర గంటల సమయం పడుతోంది. ఇవాళ 60వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us