Red cauliflower: రెడ్‌ కాలీఫ్లవర్‌ కిలో@ రూ.60

Updated 26 January 2022 Wednesday 01:30 PM

విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) : ఎన్నో పోషక విలువలు ఉండే రెడ్‌ కాలీఫ్లవర్‌ను అరకు మండలం సోవా ప్రాంతానికి చెందిన రైతు చిట్టిబాబు ఎంవీపీ కాలనీ రైతు బజారులో విక్రయానికి ఉంచాడు.. కిలో రూ.60కి రెడ్‌ కాలీఫ్లవర్‌ను విక్రయించగా వినియోగదారులు ఎగబడి వీటిని కొనుగోలు చేశారు. రెడ్‌ కాలీఫ్లవర్‌ ఇక్కడి రైతు బజారుకు రావడం ఇదే ప్రథమం. వంద రెడ్‌ కాలీ ఫ్లవర్లను ఇక్కడకు తీసుకురాగా హాట్‌కేక్‌లా అన్నీ అమ్ముడైపోయాయి. ఈ కాలీఫ్లవర్‌కు సంబంధించిన విత్తనాలను తాము ఒడిశా నుంచి తీసుకువచ్చినట్టు చిట్టిబాబు తెలిపాడు... ఒక్కో కాలీఫ్లవర్‌ కిలో నుంచి కిలోన్నర బరువు వుందని, వీటిని ఆర్గానిక్‌ విధానంలో పండించినట్టు తెలియచేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us