ఐక్య ఉద్యమాల ద్వారా ప్రత్యేక హోదా సాధ్యం

UPDATED 16th FEBRUARY 2018 FRIDAY 7:00 PM

పెద్దాపురం: ఐక్య ఉద్యమాల ద్వారా ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు దడాల సుబ్బారావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక వరహాలయ్య పేటలోని యాసలపు సూర్యారావు భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన చట్టంలో హామీలు అమలు చేయకుండా బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టిడిపి ప్రభుత్వం బిజెపి ప్రభుత్వ ప్రకటనలకు మద్దత్తుగా భజన చేయడం ఈ దుస్థితి కలిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు ప్రత్యేక హోదా అని ప్రకటిస్తే, మేము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా అన్నారని, పదిహేనేళ్ళు ప్రత్యేక హోదా అమలుచేయాలని డిమాండ్ చేసినోళ్లు అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే 90 శాతం నిధులు కేంద్రం భరిస్తుందని, రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించబడతాయని, పరిశ్రమల ద్వారా ఉపాధి, ఉన్నత విద్యావకాశాలు, ట్రాన్స్ పోర్ట్, విద్య, వైద్యం, కాకినాడ సెజ్ కారిడార్, గిరిజన యూనివర్సిటీ, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, రూ. 10 వేల కోట్లతో ఓ.ఎన్.జి.సి. ఆయిల్ రిఫైనరీ, దీనికి అనుబంధ పరిశ్రమల ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, రాయలసీమ హిందూపురంలో బెల్ ఫ్యాక్టరీ, తిరుపతిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు పొందుపరిచి ప్రత్యేక హోదాను విస్మరించి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ పాట పాడితే దానికి వంత పాడిన టిడిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను వంచించారన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రశ్నించడం కోసం జనసేన స్థాపించానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ మౌనం వీడి కార్యాచరణ దిశలో సమావేశాలు నిర్వహించడం సంతోషం అన్నారు. వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర బంద్ లో గొంతు  కలిపిన రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు సాధించాలంటే ఐక్య ఉద్యమాలే శరణ్యం అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా చట్టంలో ప్రకటించిన హామీలు నెరవేరాలంటే వీటన్నిటినీ అంగీకరించే రాష్ట్రంలోని పార్టీలన్నీ ఐక్యమై జేఏసీగా ఏర్పడి సమైక్యంగా ముందుకు సాగాలన్నారు. దీనికి సిపిఎం అన్నివిధాలా మద్దతు తెలుపుతూ ఉద్యమాల్లో భాగస్వామ్యం అవుతుందన్నారు. ఈ దశలో పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేస్తున్న సమావేశాలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు కాకుండా మరొకరి ప్రయోజనాల కోసం అయితే లక్ష్యం నిర్వీర్యమవుతుందన్నారు. ఐక్య ఉద్యమాల్లో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యమైతే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు, శాఖా కార్యదర్శి సిరిపురపు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.          
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us