గ్రంథాలయాలకు పూర్వ వైభవం

UPDATED 31st JANUARY 2026 8:00 PM

రూ.39 కోట్లతో జిల్లా గ్రంథాలయ సంస్థ బడ్జెట్‌ ఆమోదం

పోటీ పరీక్షల పుస్తకాల బడ్జెట్ రూ.15 లక్షలకు పెంపు

మూతపడ్డ నాలుగు బుక్ డిపాజిట్ సెంటర్లు పునఃప్రారంభం

సకాలంలో పెన్షన్లు, పెండింగ్ సమస్యల పరిష్కారానికి హామీ

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు ఈశ్వర్ రాజు

కాకినాడ, రెడ్ బీ న్యూస్, జనవరి 31: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలను పాఠకులకు, నిరుద్యోగ యువతకు విజ్ఞాన భాండాగారాలుగా తీర్చిదిద్దుతామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు ఈశ్వర్ రాజు వర్మ (సాయిబాబు రాజు) పేర్కొన్నారు. శనివారం కాకినాడ మెయిన్ రోడ్డు లో గల జిల్లా గ్రంథాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశంలో ఈశ్వర్ రాజు వర్మ
అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మొత్తం రూ.39 కోట్ల అంచనా బడ్జెట్‌ అంచనాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ప్రతి ఏటా కొత్త పుస్తకాల కొనుగోలుకు కేటాయించే బడ్జెట్‌ను రూ.10 నుంచి  రూ.15 లక్షలకు పెంచుతూ,  విద్యార్థులు కోరిన విధంగా అన్ని రకాల ప్రామాణిక పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. గతంలోమూతపడిన పెద్దాపురం సబ్ జైల్, రాజమండ్రి ఆర్యాపురం, తుని మండలం తేటగుంట, కూనవరం మండలం జగ్గవరం బుక్ డిపాజిట్ సెంటర్లను ప్రారంభిస్తామన్నారు. అందజేశారు. కాకినాడ జిల్లా పరిధిలో వివిధ పంచాయతీల నుంచి  సుమారు రూ.5.48 కోట్ల గ్రంథాలయ సెస్ బకాయిలు రావాల్సి ఉందని, వీటిని సకాలంలో వసూలు చేసేలా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని చైర్మన్ ఆదేశించారు. అలాగే, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ సమస్యలను వెంటనే పరిష్కరించి, వారికి సకాలంలో చెల్లింపులు జరిగేలా చూస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సూపరింటెండెంట్ ఎం. శ్రావ్య, సమాచార పౌర సంబంధాల శాఖ ఏఈఐఈ సి. బాబురావు, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి పాలంకి నాగరాజు, డిప్యూటీ లైబ్రేరియన్ కిషోర్, విద్యా, పంచాయతీ, వయోజన విద్యా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us