హిందూపురం (రెడ్ బీ న్యూస్) 28 డిసెంబర్ 2021: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఇంటిని ముట్టడించేందుకు వైసీపీ శ్రేణులు విఫలయత్నం చేశాయి. పట్టణ సమీపంలోని డంపింగ్ యార్డు తరలించే విషయమై జరుగుతున్న జాప్యంపై సామాజిక మాధ్యమాల్లో టీడీపీ, వైసీపీ నాయకులు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు వైసీపీ నాయకులు బహిరంగ చర్చకు సవాల్ విసరడంతో టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ నాయకులు బాలకృష్ణ ఇంటికి చేరుకున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు సైతం ఎమ్మెల్యే ఇంటి వద్దకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వైసీపీ నాయకులను మార్గం మధ్యలోనే నిలువరించారు. టీడీపీ నేతలు ‘జై బాలయ్య’ వైసీపీ నేతలు ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ నాయకులు బాలకృష్ణ ఇంటికి చేరుకున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు సైతం ఎమ్మెల్యే ఇంటి వద్దకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వైసిపీ నాయకులను మార్గం మధ్యలోనే నిలువరించారు. టీడీపీ నేతలు ‘జై బాలయ్య’ వైకాపా నేతలు ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.







