అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021 : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం రీసర్వే ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూ (న్యాయపరమైన ముందస్తు సమీక్ష)కి పంపింది. రీసర్వే ప్రాజెక్టులో డ్రోన్ సేవలు, లార్జ్ సైజు మ్యాపింగ్ సేవల కోసం ఆసక్తిదారుల నుంచి తీసుకునేందుకు వీలుగా ఆర్‌ఎఫ్‌పీ, టెండర్ ప్రతిపాదనల్ని న్యాయసమీక్షకు పంపించింది. రీసర్వే ప్రాజెక్టులోని భాగస్వాములు, ప్రజలు, ఆసక్తిదారులు జ్యుడీషియల్ ప్రివ్యూ న్యాయమూర్తికి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు, ఫిర్యాదులు పంపాలని ప్రభుత్వం కోరింది. డిసెంబరు 9వ తేదీలోగా దీనికి సంబంధించిన అభ్యంతరాలను ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ ఎట్ జీమెయిల్ డాట్‌కామ్ వెబ్‌సైట్‌కు పంపించాలని సర్వేసెటిల్మెంట్స్ ల్యాండ్ రికార్డుల కమిషనర్ కార్యాలయం విజ్ఞప్తి చేసింది.







