Inter Exams : తెలంగాణలో మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు

UPDATED 16th MARCH 2022 WEDNESDAY 02:40 PM

Telangana Inter exams : తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేశారు. రాష్ట్రంలో మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. మే 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

మే 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేర‌కు స‌వ‌రించిన ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం (మార్చి 16,2022) విడుద‌ల చేసింది.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరుగనున్నాయి. జీఈఈ మెయిన్స్-2022 పరీక్షల దృష్ట్యా ఇంటర్ షెడ్యూల్ లో మార్పులు చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us