UPDATED 20th APRIL 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయంలో జగద్గురు ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరాచార్య చిత్రపటానికి వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పులి నారాయణమూర్తి, ప్రముఖ పారిశ్రామికవేత్త బిక్కిన సాయి, ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్, రావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు మహంకాళి వెంకట గణేష్, పడాల వీరబాబు, దూది రాజు, పండితులు వేమూరి సోమేశ్వరశర్మ, రాంబాబు, భీమన్న, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







