UPDATED 23rd JANUARY 2018 TUESDAY 8:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేతాజీ ఒరిస్సాలోని కటక్ లో జనవరి 23,1897లో జన్మించారని, రెండు పర్యాయాలు నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారన్నారు. గాంధీజీతో తలెత్తిన సిద్ధాంతపరమైన విభేదాలతో రాజీనామా చేసి అహింసావాదంతో స్వాతంత్ర్యం సాధించలేమని నినదించి అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ను స్థాపించారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్, వివిధ విభాగాధిపతులు, గ్రంథాలయాధికారి కె. అశోక్ కుమార్, సి.హెచ్. వేణు, తదితరులు పాల్గొన్నారు.







