KA Paul Dharna : కేఏ పాల్ దూకుడు.. రేపు జంతర్ మంతర్‌లో ధర్నా.. కేసీఆర్, జగన్‌కు ఆహ్వానం

UPDATED 19th JULY 2022 TUESDAY 07:30 PM

KA Paul Dharna : తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరుబాట పట్టారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్న పాల్.. ఏకంగా ఢిల్లీలో ధర్నాకు సిద్ధమయ్యారు. రేపు జంతర్ మంతర్ లో ఆయన ధర్నాకు కూర్చుంటారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ లో ధర్నా చేస్తున్నట్లు కేఏ పాల్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను నెరవేర్చాలని పాల్ డిమాండ్ చేశారు.

తన ధర్నాకి అన్ని పార్టీలు మద్దతు తెలిపాలని పాల్ కోరారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ సహా ఎంపీలు తన ధర్నాకు రావాలని కేఏ పాల్ పిలుపు నిచ్చారు. కేంద్రం విభజన హామీలు అమలు చేయకపోతే ఆగస్టు 15 తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కేఏ పాల్ ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల విభజన చట్టాన్ని అమలు చేయాలని పాల్ కేంద్రాన్ని కోరారు. 8 ఏళ్లుగా విభజన హామీలను కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు.ఇప్పటికే ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మౌన దీక్ష చేసిన పాల్.. విభజన హామీల అమలు కోసం బుధవారం ఉదయం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతానని ఇదివరకే ప్రకటించారు. అంతేకాదు.. విభజన హామీలు అమలు చేయకపోయే ఆగస్టు 15వ తేదీ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.

తెలుగు ప్రజల సత్తా చూపకపోతే విభజన హామీలు అమలు కావన్న ఆయన.. అందుకే తాను పోరాటానికి దిగుతున్నట్టు వెల్లడించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us