UPDATED 5 FEBRUARY 2022 SATURDAY 10:00 PM
◆ గురుమౌఢ్యమితో తగ్గిన ముహూర్తాలు
కాకినాడ (రెడ్ బీ న్యూస్) : నవ వధూవరులు ప్రతి ఏటా మాఘమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఏ నెల 2 నుంచి మాఘమాసం ప్రారంభమయ్యింది. అయితే మాఘ, ఫాల్గుణ మాసాల్లో నెల రోజులపాటు గురుమౌఢ్యమి రావడంతో ఈసారి ముహుర్తాలు కాస్త తక్కువగా ఉన్నాయి. ఉన్న ముహుర్తాల్లోనే వివాహాది శుభకార్యాలకు సిద్ధపడుతున్నారు. బుధవారం నుంచి మార్చి 2 వరకు మాఘమాసం కాగా మార్చి 3 నుంచి ఏప్రిల్ 1 వరకు ఫాల్గుణ మాసం. అయితే ఈ నెల 19 నుంచి మార్చి 20 వరకు నెల రోజులపాటు గురుమౌఢ్యమి రావడంతో శుభ ముహుర్తాలు తగ్గిపో యాయని బండారులంకకు చెందిన ప్రముఖ పంచాంగకర్త కాలెపు భీమేశ్వరరావు సిద్ధాంతి తెలిపారు. ఓవైపు కొవిడ్ నిబంధనలు కూడా అమలులో ఉండడంతో కొందరైతే శుభ కార్యక్రమాలను మమ అనిపించేలా చేయడానికి సైతం సిద్ధపడుతుంటే మరి కొందరు భారీగా వేడుకలు నిర్వహించడానికి పేరొందిన కల్యాణ మండపాలను సిద్ధం చేసుకున్నారు.
● వివాహ శుభ ముహూర్తాలు..
మాఘమాసంలో భాగంగా బుధవారం నుంచి వివాహ శుభ ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 2,3,4,5,10,11,16 తేదీలతోపాటు మార్చి 24, 26,27 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నాయి.
● శంకుస్థాపన ముహూర్తాలు..
ఈనెల 2,3,5,6,7,10,11,13,14 తేదీలతోపాటుగా మార్చి 21,26,27,28 తేదీల్లో శంకుస్థాపన ముహూర్తాలున్నాయి. గృహప్రవేశాలకు ఈనెల 2,3,4,5,6,10, 11,14,18 తేదీలతోపాటు మార్చి 26,27 తేదీల్లోను ముహూర్తాలు ఉన్నాయి. అక్షరాభ్యాసానికి సంబంధించి ఈనెల 2,3,5,6,7,10,11,13,14 తేదీలతో పాటు మార్చి 21, 27, 28 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.







