Jagan Meets Modi : ప్రధానితో ముగిసిన జగన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

UPDATED 2nd JUNE 2022 THURSDAY 08:00 PM

Jagan Meets Modi : ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికలు, రాష్ట్ర రుణపరిమితిపైనా చర్చించినట్లుగా సమాచారం. పోలవరం ప్రాజెక్ట్ నిధులు విడుదల చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు జగన్.

తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రావాల్సిన నిధులను ఇప్పించాలని ప్రధానిని కోరారు జగన్. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా జగన్ వెంట ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ప్రధానితో జగన్ భేటీ.. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ ఎంపీల మద్దతు బీజేపీకి అవసరం.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us