SCR: భారీగా పెరిగిన రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరలు

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 9 జనవరి 2022 : సంక్రాంతి పర్వదినం సందర్భంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోతోంది. ప్రయాణికులతో పాటు వారి బంధువులు కూడా ఎక్కువ సంఖ్యలో రావడంతో రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే.. ప్లాట్‌ఫాం టికెట్ ధరలను భారీగా పెంచింది. పెంచిన ధరలను ఈనెల 20వ తేదీ వరకు అమలు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేశ్ వెల్లడించారు. సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.10 నుంచి రూ.50వరకు పెంచామన్నారు. నాంపల్లి, కాచిగూడ, వరంగల్, ఖమ్మం, లింగంపల్లి, కాజీపేట్, మహబూబ్ నగర్, రామగుండం, మంచిర్యాల, భద్రాచలం, వికారాబాద్, తాండూర్, బీదర్, బేగం పేట్ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధరలను రూ. 10 నుంచి రూ.20వరకు పెంచామన్నారు. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వేశాఖ తెలిపింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us