UPDATED 9th AUGUST 2017 WEDNESDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లోఈ నెల తొమ్మిది నుంచి 12 వరకు నాలుగు రోజులు పాటు స్టాటిస్టికల్ ప్యాకేజీ ఫర్ సోషల్ సైన్సెస్ (ఎస్ పి ఎస్ ఎస్) అనే అంశంపై వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నట్లు బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన హెడ్ అండ్ డైరెక్టర్ అఫ్ స్టాటిస్టిక్స్ డాక్టర్ మునిస్వామి ఈ నాలుగు రోజుల వర్క్ షాప్ ను నిర్వహిస్తారని ఆమె తెలిపారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఈ వర్క్ షాప్ లో ప్రాజెక్ట్ తయారీ, రీసెర్చ్, తదితర అంశాలలో నైపుణ్యం పెంపొందించుకుని ఎన్నో విషయాలు నేర్చుకునే వీలు కలుగుతుందని అన్నారు. అలాగే గణాంక శాస్త్రమునకు సంబందించిన అన్ని మెళకువలను ఈ వర్క్ షాప్ లో కూలంకషంగా విద్యార్థులకు తెలియచేయడం జరుగుతుందన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. విశాలాక్షి మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ లో పిజిడిఎం, ఐఎంబీయే, ఫైనల్ ఇయర్ బిబిఎ విద్యార్థులు పాల్గొనవచ్చని ప్రాజెక్ట్ వర్క్ లో పూర్తి అవగాహన కలిగి మంచి ఫలితాలు సాధించేందుకు మేలు కలుగుతుందని తెలిపారు.







