రోడ్డు ప్రమాదంలో సామర్లకోట ఎంపీపీ మృతి

UPDATED 10th FEBRUARY 2018 SATURDAY 8:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండల పరిషత్‌ అధ్యక్షురాలు గొడత మార్త (40) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం జరిగిన కౌశల్‌ గోదావరి ఇంటర్వ్యూలకు ఎంపీపీ మార్త హాజరై, తిరిగి కార్యాలయ సబార్డినేట్‌ శ్రీరామ్ బుల్లెట్ పై తన స్వగ్రామమైన వేట్లపాలెం బయలుదేరారు. సామర్లకోట పశువుల ఆసుపత్రి సమీపంలో బుల్లెట్ రోడ్డు మార్జిన్‌ దిగి కోతకు గురవడంతో ద్విచక్ర వాహనంతో పాటు ఇద్దరూ కింద పడటంతో ఎంపీపీ తలకు తీవ్ర గాయమైంది. ఇంతలో వెనుకనే వస్తున్న టిడిపి జిల్లా వాణిజ్య విభాగం మాజీ కార్యదర్శి గుమ్మళ్ల రామకృష్ణ వారిని సామర్లకోట ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యుల సిఫార్సు మేరకు108 వాహనంలో కాకినాడ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు సమాచారం తెలియడంతో ఆయన పిఎ  సుబ్బారావును ఆసుపత్రికి పంపించి జరిగిన సంఘటన వివరాలను తెలుసుకున్నారు. ఎంపీపీ గొడత మార్త అకాల మృతికి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో సుశిక్షితురాలైన కార్యకర్తగా ఉంటూ సామర్లకోట ఎంపీపీగా మండల పరిషత్‌ అభివృద్ధికి, సామర్లకోట మండల అభివృద్ధికి ఎనలేని సేవలందించారన్నారు. ఆమె మృతి మండల తెలుగుదేశం పార్టీకి తీరని లోటన్నారు. ఎంపీపీ భర్త వీరన్నను, కుటుంబ సభ్యులను మంత్రి ఫోన్‌లో పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us