UPDATED 4th NOVEMBER 2017 SATURDAY 11:30 AM
పెద్దాపురం: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఆరున చేపట్టనున్న పాదయాత్ర (సంకల్పయాత్ర) విజయం కోరుతూ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణ వైసీపీ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయడు ఆధ్వర్యంలో శనివారం పాదయాత్ర చేపట్టారు. ముందుగా మరిడమ్మ అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర సామర్లకోట భీమేశ్వరస్వామి దేవస్థానం వరకు సాగుతుందని వైసీపీ వర్గాలు తెలిపారు. ఆయన పాదయాత్రకు మద్దతుగా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. వైసీపీ అధినేత జగన్ చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలని ఈ యాత్ర చేపట్టినట్టు సుబ్బారావు నాయుడు తెలిపారు. సుమారు 1000 మంది వైసీపీ కార్యకర్తలతో ఏడు కిలో మీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.







