గంజాయి తరలిస్తూ ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్టు

UPDATED 16th NOVEMBER 2020 MONDAY 5:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): గంజాయిని తరలిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిని స్థానిక పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పెద్దాపురం సీఐ జయకుమార్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక దర్గా సెంటర్‌లో వాహనాల తనిఖీలు చేస్తుండగా గంజాయితో అనుమానాస్పదంగా తిరుగుతున్న గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంతాభాయ్ అనే యువకుడిని అరెస్టు చేశామని చెప్పారు. అతడి వద్ద 8 కిలోల వరకు గంజాయి ఉందనన్నారు. అతడు సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడని, వ్యసనాలకు అలవాటు పడి గంజాయి అక్రమ రవాణా చేయడంతో పాటు స్థానికంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో చదివే యువకులకు విక్రయాలు చేస్తున్నాడని తెలిపారు. అలాగే మరో యువకుడు ప్రగతి కళాశాలలో చదువుతున్నాడని, అతడి నుంచి కాంతాబాయ్ కొనుగోలు చేశాడని చెప్పారు. అతడిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.24 వేల వరకు ఉంటుందని చెప్పారు. చింతపల్లి ఏజన్సీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని నిందితుడు కొనుగోలు చేశాడని తెలిపారు. తహసీల్దార్  బూసి శ్రీదేవి సమక్షంలో గంజాయిని సీజ్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఏ. బాలాజీ పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us