గుంటూరు (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ మీదుగా కాకినాడ టౌన్ – లింగంపల్లి – కాకినాడ మీదుగా రైళ్ల రవాణా సంఖ్యను పెంచామని గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం నరేంద్ర వర్మ గురువారం వెల్లడించారు. నంబర్ 07275 రైలు కాకినాడ టౌన్–లింగంపల్లి వయా గుంటూరు డివిజన్ మీదుగా ఈ నెల 22, 25 ,27, 29 వరకు ఈ సంఖ్యను పెంచామని తెలిపారు. అలాగే 07276 నంబర్ రైలు లింగంపల్లి–కాకినాడటౌన్ వయా గుంటూరు డివిజన్ మీదుగా ఈ నెల 23, 26, 28, 30వ తేదీల వరకు రైళ్ల సంఖ్యను పెంచామని చెప్పారు.







