CM Jagan: రేపు కడపకు వెళ్లనున్న జగన్

UPDATED 19th FEBRUARY 2022 SATURDAY 09:00 PM

కడప: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం కడపలో పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. సీఎం గన్నవరం నుంచి ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.45 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి రిమ్స్‌కు చేరుకుంటారు. అక్కడ ఉదయం 10 గంటలకు రింగ్‌ రోడ్డులోని పుష్పగిరి విట్రియో రెటీనా ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి జయరాజ్‌ గార్డెన్స్‌లో జరిగే అంజాద్‌బాషా కుమార్తె వివాహానికి హాజరవుతారు. అంజద్‌బాషా కుమార్తె పెళ్లి వేడుకలో 11.50 నుంచి 12.10 గంటల వరకు పాల్గొంటారు. 12.20 గంటలకు ఎయిర్‌పోర్టు చేరుకొని 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళతారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us