Konaseema Thirumala Vadapalli : సర్వ జగద్రక్షకుడు..శ్రీనివాసుడు

UPDATED 20th OCTOBER 2022 THURSDAY 06:00 AM

▪️ శ్రీకృష్ణ అలంకరణతో సూర్యప్రభ వాహనంపై శ్రీవారు

▪️ మోహినీ అలంకరణతో చంద్రప్రభ వాహనంపై విహరించిన శ్రీవారు

Konaseema Thirumala Vadapalli : వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దశమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం వేకువజామున సుప్రభాత సేవ, నవ నీత హారతతులను వేదపండితులు శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, విశేషార్చన, అష్టోత్తర శతకలశాభిషేకం, లక్షతులసి పూజ, ప్రధాన హోమాలు నిర్వహించారు. శ్రీకృష్ణ అలంకరణతో సర్వాలంకృతుడైన శ్రీవారు సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో విహరించారు.

సాయంత్రం స్వస్తివచనము, నవగ్రహ హోమాలు, లక్ష్మీవేంకటేశ్వర మూలమంత్ర పూర్వక వేంకటేశ్వర హోమాలను ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేదపండితులు, అర్చకులు జరిపారు. రాత్రి మోహినీ అలంకరణతో చంద్రప్రభ వాహనంపై శ్రీవారు తిరువీధుల్లో విహరించారు. కేరళ వాయిద్యాలు, డోలు, సన్నాయి, కోలాట ప్రదర్శనలు భక్తులను ఆక ట్టుకున్నాయి.

ఆలయ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు - ఉమాదేవి దంపతులు, ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, హైమాపార్వతి దంపతులు, ధర్మకర్త పి.సురేష్‌రాజు పూజలు చేశారు. ధర్మకర్తలు మన్యం సూర్య కుమారిభాను, రెడ్డి రవీదేవి, మెర్ల వెంకటేశ్వర్లు, ఏపుగంటి కనకారావు, శనగన సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us