Prostitution : వ్యభిచార గృహాల్లో పట్టుబడిన 14 మంది మహిళలు పరార్

UPDATED 19th FEBRUARY 2022 SATURDAY 03:50 PM

Prostitution : సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలో పలు వ్యభిచార గృహలనుంచి 14 మంది మహిళలను పోలీసులు ఇటీవల అదుపులోకీ తీసుకున్నారు. వీరిలో 19-25 వయస్సు గల మహిళలు ఉన్నారు. వీరిలో పరివర్తన తీసుకురావటానికి…. సమాజంలో గౌరవంగా బతికేందుకు వీరిని నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళా అనాధాశ్రమంలో చేర్పించారు. గత 20 రోజులుగా వారికి ఉపాధి శిక్షణ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. అయితే గత రాత్రి 2 గంటల సమయంలో ఈ 14 మంది మహిళలు పక్కా ప్లాన్ ప్రకారం ఆశ్రమంలోని బాత్ రూం వెంటిలేటర్ ను విరగొట్టి…. ప్రహరీ గోడను దూకి పారిపోయారు.

ఉదయం 14 మంది మహిళలు కనిపించక పోవటంతో ఆశ్రమ సిబ్బంది సీసీటీవీ ఫుటేజి పరిశీలించి చూడగా… ఈ సంఘటన వెలుగు చూసింది. దీంతో ఆశ్రమ నిర్వాహకులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us