Updated 12th June 2023 Monday 11:10 am
Silver Vakili Queue Line : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి వద్ద క్యూ లైన్ లో మార్పులు చేసింది. భక్తుల మధ్య తోపులాటలు జరుగకుండా వెండి వాకిలి నుంచి సింగిల్ లైన్ క్యూ లైన్ విధానం అమలు చేసింది.
వెండి వాకిలి వద్ద మార్పులతో అత్యధిక సంఖ్యలో భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న(ఆదివారం) రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గత నాలుగు సంవత్సరాల కాలంలో ఆదివారం దర్శించుకున్న భక్తులే అత్యదికం.
జూన్11న శ్రీవారిని 92,238 మంది భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శనం క్యూ లైను ద్వారానే స్వామివారిని 70 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.







