తిరుమల (రెడ్ బీ న్యూస్) 13 జనవరి 2022 : శ్రీవారి ఆలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. మధ్యాహ్నం నుంచి క్యూలైన్లలో ఉన్నా పట్టించుకోలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాద్వారం ఎదుట భక్తులు ధర్నాకు దిగారు. టీటీడీ చైర్మన్, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమను శ్రీవారి దర్శనానికి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు.