ఢిల్లీకి బయలుదేరిన మహిళా కాంగ్రెస్ నేతలు

UPDATED 12th DECEMBER 2017 TUESDAY 9:30 PM

గన్నవరం : ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ వర్క్ షాప్, ఏఐసీసీ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికయిన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీని అభినందించేందుకు మహిళా కాంగ్రెస్ నేతలు మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది మహిళా నేతలు పార్టీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో ఢిల్లీకి పయనమయ్యారు. గన్నవరం విమానశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానంలో మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీతో పాటు గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక, విజయవాడ మహిళా అధ్యక్షురాలు కెంబూరి శ్రీలక్ష్మి, తిరుపతి మహిళా అధ్యక్షురాలు బుర్ర సావిత్రి యాదవ్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కుర్షిదా బయలుదేరి వెళ్లారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us