Updated 26th April 2017 Wednesday 5:30
పెద్దాపురం: ప్రజా సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసిపి పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు అన్నారు. మండలంలోని గుడివాడ గ్రామంలో నిర్వహించిన గడపగడపకు వైసిపి కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. అలాగే సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం వెనుకబడి ఉందని ఎద్దేవా చేశారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పేర్నేడి ఈశ్వరరావు , కనపర్తి సీమదొర, సుబ్రహ్మణ్యం, బాబి, సత్యనారాయణ, గోపు మురళి తదితరులు పాల్గొన్నారు.







