AP News: పీఆర్సీ సాధన సమితిపై మంత్రుల కమిటీ ఫైర్

Updated 28 January 2022 Friday 02:30 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): పీఆర్సీ వివాదం మరింత ముదురుతోంది. చర్చలకు రావాలని ప్రభుత్వం సూచిస్తున్నా.. తాము వినిపిస్తున్న డిమాండ్లను పరిష్కరిస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగుల సంఘాలు తేల్చిచెబుతుండడంతో చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. 2022, జనవరి 28వ తేదీ శుక్రవారం కూడా ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు మంత్రుల కమిటీ ఎదురు చూసింది. వారు రాకపోవడంపై మంత్రుల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక స్టీరింగ్ కమిటీ పిలుస్తేనే వస్తామని, వారితో చర్చలకు ప్రభుత్వం తలుపులు తెరిచే ఉందని..అయితే..ఇలాగే వ్యవహరిస్తే.. చట్టం ప్రకారం జరుగుతోందని మంత్రి బోత్స వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us