ఆదిత్యలో విజవంతంగా మెగా రక్తదాన శిబిరం

UPDATED 30th JANUARY 2018 TUESDAY 9:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థలలో మంగళవారం ఏర్పాటు చేసిన మెగా రక్తాదాన శిబిరం విజయవంతమైనట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి  మాట్లాడుతూ ఆదిత్య సంస్థ వ్యవస్థాపక సభ్యురాలు, జనరల్ సెక్రటరీ లక్షీరాజ్యం జన్మదినోత్సవం పురస్కరించుకొని గత 15 సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం రెండు పర్యాయాలు తమ సంస్థ విద్యార్థుల, ఉద్యోగుల సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహించి, జిల్లాలోని వివిధ బ్లడ్ బ్యాంకులకు రక్తాన్ని అందచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన బాదం బాలకృష్ణ, డాక్టర్ వై. డి. రామారావు మాట్లాడుతూ ఆదిత్య విద్యా సంస్థలు ప్రతీ సంవత్సరం రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసి మిగిలిన సంస్థలకు ఆదర్శంగా నిలవడం అభినందనీయమని, ఒక ఆదర్శవంతమైన నిర్ణయంతో వేలాది యూనిట్ల రక్తం రక్తనిధి కేంద్రాలకు అందించడం గొప్ప విషయం అన్నారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ నేడు రక్తం సకాలంలో అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అటువంటి వారికి మనం అందించే రక్తం ద్వారా ప్రాణాలు నిలపవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ శిబిరంలో 175 మంది విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొని రక్తదానం చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల జనరల్ సెక్రటరీ లక్ష్మీరాజ్యం, ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామ కృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ కె. రవిశంకర్, డాక్టర్ ఎన్. విశాలాక్షి, డాక్టర్ మోహన్, టి.ఎస్.వి.ఎస్. కుమార్, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ, వివిధ బ్లడ్ బ్యాంకుల వైద్యులు, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.                  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us