Mehreen: ముఖంపై సూదులు గుచ్చుకున్న హీరోయిన్.. ఎందుకో తెలుసా

Updated 1st December 2022 12:55 pm

Mehreen: టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ పీర్జాదా వరుస సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆమె తొలి సినిమా ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో, ఆమెకు ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. అయితే వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న మెహ్రీన్, ఎఫ్2 మూవీతో మళ్లీ పుంజుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వెళ్తోంది ఈ బ్యూటీ.

అయితే తాజాగా మెహ్రీన్‌కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ముఖం నిండా సూదులు గుచ్చుకుని ఉన్న ఫోటోను మెహ్రీన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మెహ్రీన్‌కు ఏమైంది.. ఆమె ముఖంపై ఇలా సూదులు ఎందుకు గుచ్చారని వారు చర్చించుకుంటున్నారు. అయితే తాను ప్రస్తుతం ఆక్యుపంక్చర్ అనే ట్రీట్‌మెంట్‌లో ఉన్నాని.. ఇందులో ఆక్యుస్కిన్‌లిఫ్ట్ థెరఫీలో భాగంగా ముఖంపై సూదులు గుచ్చుకున్నట్లుగా ఆమె తెలిపింది.

ఈ ట్రీట్‌మెంట్ కారణంగా తన ముఖం మరింత కాంతివంతంగా మారుతుందని మెహ్రీన్ అంటోంది. అయితే ఈ ఫోటోను చూసిన అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అమ్మడికి ఏమయ్యిందా అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఏజ్ బార్ అయిన మహిళలు ఎక్కువగా ఈ ట్రీట్‌మెంట్ చేయించుకుంటారు. కానీ 27 ఏళ్లకే మెహ్రీన్ ఎందుకు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి మెహ్రీన్ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us