UPDATED 14th NOVEMBER 2022 MONDAY 11:10 AM
Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ స్వల్ప అస్వస్థతకి గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో కృష్ణ ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కాంటినెంటల్ హాస్పటల్ వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ గారి ఆరోగ్యం నిలకడగా ఉంది. స్వల్ప అస్వస్థతకి గురయ్యారు. చికిత్స అందిస్తున్నాము. 24 గంటల తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతారు అని తెలిపారు. దీంతో కృష్ణ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అభిమానులు ఎవరూ ఆసుపత్రికి రావొద్దని కుటుంబ సభ్యులు కోరారు.







