పొన్నలూరు చెరువులో ఆర్టీసీ బస్సు బోల్తా

కందుకూరు (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021 : ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. నాగిరెడ్డిపాలెం సమీపంలో చెరువు కట్టపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే.. కందుకూరు నుంచి కనిగిరి వైపు వెళ్తున్న బస్సు.. చెరువు కట్టపైకి రాగానే అదుపుతప్పి చెరువులోకి బోల్తా పడింది. ఆ సమయంలో అక్కడ చేపలు పట్టేవారు గమనించి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉండగా.. వారు స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us