Updated 31 January 2022 Monday 10:30 PM
తిరుమల (రెడ్ బీ న్యూస్): కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫిబ్రవరి 8న తిరుమలలో ఏకాంతంగా రథసప్తమి వేడుకలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ సందర్భంగా వాహన సేవలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తారు. ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ ఆ రోజున రద్దు చేసింది.
★ సూర్యప్రభ వాహనం: ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు
★చిన్నశేష వాహనం : ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు
★గరుడ వాహనం : ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
★ హనుమంత వాహనం : మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు
★ చక్రస్నానం : మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 గంటల వరకు
రంగనాయకుల మండపంలో...
★ కల్పవృక్ష వాహనం : సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు
★ సర్వభూపాల వాహనం : సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు
★ చంద్రప్రభ వాహనం : రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ రథసప్తమి వేడుకలు ఏకాంతంగా నిర్వహించనున్నారు.







