క్రీడల్లో యువతను ప్రోత్సహించాలి

Updated 28th April 2017 Friday 10:00 AM

పెద్దాపురం: క్రీడల్లో యువతను ప్రోత్సహించి వారికి మానసికోల్లాసం కలిగించాలని క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కెఎస్ కిరణ్ రాజు అన్నారు. స్థానిక రామారావుపేటలోని శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ లో జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి క్రికెట్ శిక్షణా శిబిరాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. కాకినాడలో అసోసియేషన్ తరఫున జిల్లా స్థాయి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పెద్దాపురం, అమలాపురం, రాజమహేంద్రవరం నగరాల్లో ఆయా పరిధిలో యువతీ, యువకులకు క్రికెట్ లో  శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ శిక్షణా శిబిరాల వల్ల క్రీడల్లో మెళకువలు, నైపుణ్యం పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపు ఇన్ ఛార్జ్ ఆవాల లక్ష్మీనారాయణ, సహాయ  కార్యదర్శి కొండలరావు, ఇజ్రాయిల్ రాజు, కోచ్ దుర్గాప్రసాద్, కృష్ణమూర్తి, విజయకృష్ణ, సాగర్, శ్రీ ప్రకాష్ డీన్ బి. రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us