Updated 25th July 2023 Tuesday 5:50 pm
Tiger Nageswara Rao Teaser : వరుస విజయాలతో మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) మంచి జోష్‌లో ఉన్నాడు. అదే ఉత్సాహంలో వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇందులో ఇండియన్ రాబిడ్ హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ అధారంగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) చిత్రం ఒకటి. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ చిత్ర దర్శకుడు వంశీ సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘హలో తమ్ముళ్లు, మీ మెసేజ్ లు చూసి మళ్లీ మీకు ఆకలేస్తుందని అర్థమైంది. ఈ సారి మనం పెంచిన పులి వేటాడటానికి సిద్ధమయ్యింది. త్వరలోనే టీజర్ డేట్ అనౌన్స్ చేస్తాము. కొంచెం ఓపిక పట్టండి.’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో త్వరలోనే టీజర్ విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.







