హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను ఆదా చేయాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఇంట్లో పిల్లలకు సైతం అవగాహన కల్పించాలని సూచించారు. హైదరాబాద్ హైటెక్స్‌లో తెలంగాణ స్టేట్ రెన్యుబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా రెడ్కో సంస్థ సూచించిన ప్రమాణాలకు మించి విద్యుత్ పొదుపు చేపట్టిన పరిశ్రమలు, విద్యా సంస్థలు, రైల్వే స్టేషన్లు, బస్ డిపోలకు అవార్డులు ప్రదానం చేశారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టిన టీఎస్‌ఈసీఏను గవర్నర్ అభినందించారు. వివిధ విభాగాల్లో విద్యుత్ ఆదా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ, ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి, రెడ్కో ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ కార్యక్రమానికి హాజరయ్యారు.







