చ‌ల‌ప‌తిరావు వ్యాఖ్య‌లు రాంగా? రైటా?

UPDATED 23rd MAY 2017 TUESDAY 5:00 PM

REDBEENEWS: సినీ న‌టుడు చ‌ల‌ప‌తిరావు మ‌హిళ‌ల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై వివాదం చెల‌రేగింది. అది కాస్తా చినికి చినికి గాలివాన‌గా మారింది. సినిమా ఇండ‌స్ట్రీ, మ‌హిళా సంఘాలు చ‌ల‌ప‌తిరావుపై ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు రారండోయ్ సినిమా నిర్మాత‌ల‌కు ఇది త‌ల‌నొప్పిగా మారింది. ఎందుకంటే ఈ సినిమా ఆడియో వేడుక‌లోనే చ‌ల‌ప‌తి రావు వ్యాఖ్య‌లు చేసింది. ఈ వివాదం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. చ‌ల‌ప‌తిరావు పేరు ట్రెండింగ్ యాష్ టాగ్‌గా మారింది. హీరోలు నాగార్జున‌, నాగ‌చైత‌న్యలు చ‌ల‌ప‌తిరావు వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మ‌హిళా సంఘాల ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇంత‌కీ చ‌ల‌ప‌తిరావు చేసిన త‌ప్పేంటి? అయ‌న వ్యాఖ్య‌లు రైటా? రాంగా? అంటే విష‌యానికొస్తే...రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో వేడుక సంద‌ర్భంగా వేదిక‌పై యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు చ‌ల‌ప‌తిరావు కొంచెం తిక్క‌గా స‌మాధాన మిచ్చారు. ఈ సినిమా ట్ర‌య‌ల‌ర్‌లో అమ్మాయిలు మ‌న‌శ్శాంతికి హానిక‌రం అనే క్యాప్ష‌న్ ఉంటుంది. ఆడియో ఫంక్ష‌న్‌లో ఇదే ప్ర‌శ్న‌ను యాంక‌ర్ చ‌ల‌ప‌తిరావును అడిగింది. నిజంగానే అమ్మాయిలు మ‌న‌శ్శాంతికి ప్ర‌మాద‌మా? అని చ‌ల‌ప‌తిరావు స‌మాధాన‌మిస్తూ.. అమ్మాయిలు హానిక‌రం కాదుగానీ, ప‌క్క‌లో ప‌డుకోవ‌డానికి ప‌నికొస్తారు అన్నారు. ఇదీ జరిగింది. అయితే ఒక సీనియ‌ర్ న‌టుడు సినిమాల్లో కాక‌పోయినా క‌నీసం బయటన్నా మ‌హిళ‌ల‌కు గౌర‌వ‌మియ్యాలి క‌దా అనేది మ‌హిళ‌లు, మ‌హిళా సంఘాల అభిప్రాయం. అమ్మాయిలు మ‌న‌శ్శాంతికి హానిక‌రం కాదు అనే అర్థంలో తాను మాట్లాడాన‌ని స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ అస‌లు ఆయన మాట్లాడింది టోట‌ల్‌గా రాంగ్‌. మాట్లాడ్డం రాక‌పోతే అలాంటి వేదిక‌పై మాట్లాడొద్దు. ఒక వేళ ఏదో పొర‌పాటున మాట్లాడినా వెన‌క్కి తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలిగానీ ఆయ‌న క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us