కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దీపావళి పండుగ నిర్వహించుకోవాలి

ఆర్డీవో వెంకటరమణ

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 1 నవంబర్ 2021: ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలని ఆర్డీవో పి.వెంకటరమణ కోరారు. స్థానిక విలేఖరులతో ఆయన సోమవారం మాట్లాడారు. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చుకోవాలని, కాలుష్యరహిత బాణాసంచా మాత్రమే వినియోగించాలన్నారు. ఊరికి దూరంగా ఖాళీ ప్రదేశాల్లో మండల జాయింట్ కమిటీ నిర్ణయించిన ప్రదేశాల్లో మాత్రమే బాణాసంచా సామాగ్రి దుకాణాలను ఏర్పాటు చేస్తారన్నారు. ప్రభుత్వ లైసెన్సు పొందిన దీపావళి షాపులు మాత్రమే సామాగ్రిని అమ్మే హక్కు కలిగి ఉంటారని, ఎవరైతే అనుమతిలేకుండా మందుగుండు సామాగ్రి విక్రయాలు సాగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. మందుగుండు సామాగ్రి అమ్మే దుకాణాల మధ్య దూరం పది అడుగుల్లో ఉండాలన్నారు. మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేసే వ్యక్తులు ఆరు అడుగుల దూరంలో భౌతికదూరం పాటిస్తూ కొనుగోలు చేసుకోవాలన్నారు. దీపావళి సామాగ్రిని కాల్చిన తర్వాత శానిటైజర్ ఉపయోగించకుండా కేవలం సబ్బుతో మాత్రమే చేతులను శుభ్రపరుచుకోవాలన్నారు. దీపావళి పండుగను డివిజన్ లో ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని ఆర్డీవో కోరారు. అలాగే బాణసంచా షాపుల వద్ద మండల జాయింట్ కమిటీ అధికారులు పర్యవేక్షణ ఉంటుందని ఆర్డీవో తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us