UPDATED 18th MAY 2026 8:10 AM
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజీకి చేరాయి. ఇరాన్‌పై అమెరికా మళ్లీ సైనిక దాడులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటూ అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి వరుసగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెండు దేశాల మధ్య రాజీ కుదుర్చుకోవడానికి ఇరాన్‌కు ఇక ఎంతమాత్రం ఎక్కువ సమయం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. "ఇరాన్ ఇప్పటికైనా త్వరపడి నిర్ణయం తీసుకోకపోతే, చివరకు ఆ దేశానికి ఏమీ మిగలదు" అంటూ ఆయన హెచ్చరించారు.
సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..
తాజాగా తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' (Truth Social) లో ట్రంప్ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌పై అన్ని వైపుల నుంచీ దాడులు జరిగేలా ఉన్న ఒక ఫోటోను ఆయన ఈ సందర్భంగా షేర్ చేశారు. అమెరికా సైనిక చర్యకు సిద్ధంగా ఉందనే సంకేతాలను ఇచ్చేలా ఈ పోస్ట్ ఉండటంతో, పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.







