UPDATED 20th JULY 2022 WEDNESDAY 09:00 PM
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే ఆగస్టు నెలలో ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఆయా ప్రాంతాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని 30 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఎస్‌సీఆర్ (సౌత్ సెంట్రల్ రైల్వే) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆగస్టు లో పండుగలను పురష్కరించుకొని అదేవిధంగా తిరుమలకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. హైదరాబాద్ – తిరుపతి, కాచిగూడ – నర్సాపూర్, తిరుపతి – కాచిగూడ మధ్య రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది.07643 హైదరాబాద్ – తిరుపతి మధ్య జూలై 25, ఆగస్ట్ 1, 8, 15, 22, 29 తేదీల్లో ట్రైన్స్ నడవనున్నాయి. 07644 తిరుపతి – హైదరాబాద్ మధ్య జూలై 26, ఆగస్ట్ 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. 07612 కాచిగూడ – నర్సాపూర్ మధ్య జూలై 25, ఆగస్ట్ 1, 8, 15, 22, 29 తేదీల్లో రైళ్లు నడుస్తాయి. 07613 నర్సాపూర్- కాచ్చిగూడ మధ్య జూలై 26, ఆగస్ట్ 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. 07614 తిరుపతి- కాచిగూడ మధ్య జూలై 27, ఆగస్ట్ 3, 10, 17, 24, 31 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.







