పారిశ్రామికాభివృద్ధిలో ఇంజనీరింగ్ విద్యార్థుల పాత్ర కీలకం

UPDATED 16th JUNE 2017 FRIDAY 4:30 PM

గండేపల్లి: పారిశ్రామికాభివృద్ధిలో ఇంజనీరింగ్ విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ట్రూజియో టెక్నాలజీస్ ఫౌండర్, సీఈవో కె. సంజయ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో పారిశ్రామిక రంగంలో అనుసరిస్తున్న విధానాలపై నిర్వహించిన అవగాహనా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై శుక్రవారం మాట్లాడారు. మన దేశంలో ప్రతిభకు కొదవలేదని విద్యాధికులు సొంతంగా ఆలోచన చేయగల యువశక్తితో నిండిన నిపుణులు ఉన్నట్లు పేర్కొన్నారు. యువతకు  ఇంజనీరింగ్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకునేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు నిరంతర సాధన చేయాలని సూచించారు. పారిశ్రామిక రంగం లో తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో అధిక ఉత్పత్తి లాభాలు సాధించడం పైనే అందరి దృష్టి ఉన్నదని వినూత్న ఆలోచనలతో నూతన విధానంలో ఎవరు ముందుకు సాగుతారో వారే విజేతలుగా ముందుంటారని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే వారి జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని ఎప్పటికప్పుడు నూతన విషయాలను తెలుసుకోవాలన్నారు. ఆంగ్ల భాష పై పట్టు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, సీఎస్ఈ , ఐటి విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.   
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us