సంకల్ప్ 2కె17లో ఆదిత్య విద్యార్థుల ప్రతిభ

UPDATED 30th DECEMBER 2017 SATURDAY 5:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం బిటెక్ ఈఈఈ చదువుతున్న విద్యార్థులు సంకల్ప్ 2కె17లో విశేష ప్రతిభ కనబరిచినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 28, 29 తేదీల్లో ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల, భీమవరంలో జరిగిన సంకల్ప్ 2కె 17 జాతీయస్థాయి టెక్నికల్ సింపోజియం పేపర్, పోస్టర్ ప్రెసెంటేషన్స్ లో విశేష ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారన్నారు. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, హెచ్ వి డి మనోజ్ కుమార్ రెడ్డి, అధ్యాపకులు, తదితరులు విజేతలను అభినందించారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us