CM Jagan: చంద్రబాబు నాయుడు కలియుగ కబ్జాదారుడు, రావణుడు: సీఎం జగన్

UPDATED 23rd NOVEMBER 2022 WEDNESDAY 3:20 PM

Jagan slams chandra babu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలియుగ కబ్జాదారుడు, రావణుడు అని ఏపీ సీఎం జగన్ అన్నారు. రాజకీయమంటే ఒక జవాబుదారీతనమని, మోసం చేసే చంద్రబాబుకి ప్రజలు గుడ్ బై చెప్పాలని కోరారు. ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ప్రజలు మోసగాళ్ల మాటలను నమ్మద్దని కోరారు. సొంతంగా పార్టీ పెట్టుకుని ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌, జగన్‌ అధికారంలోకి వచ్చారని చెప్పారు. అయితే, తెలుగు దేశం పార్టీని కబ్జా చేసిన చంద్రబాబుని ఓ కబ్జాదారుడు అంటారని విమర్శించారు. సొంత పార్టీ స్థాపించి అధికారంలోకి వస్తే రాముడు అంటారని, మామ పార్టీని లాగి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుని రావణుడు అంటారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. అలాంటి చంద్రబాబుకు 2024లో ‘బాయ్ బాయ్’ చెప్పాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై జరిగే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, ప్రజలకు మంచి జరిగిందని భావిస్తే తనకు మద్దతివ్వాలని జగన్ అన్నారు.

‘‘అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వే చేపడుతున్నాం. 17వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో భూములు సర్వే చేస్తున్నాం. రెండేళ్ల కొంద గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించాం. తొలిదశలో రెండు వేల రెవెన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందించాం. ఫిబ్రవరిలో రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే. మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు ఇస్తాం. ఆగస్ట్‌, 2023 కల్లా 9వేల గ్రామాల్లో సర్వే పూర్తి అవుతుంది’’ అని సీఎం జగన్‌ తెలిపారు.

నరసాపురం లో రెండు లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్డు విస్తరణకు మంత్రి ధర్మాన కోరిక మేరకు సీఎం జగన్ పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తునట్టు ప్రకటించారు. ఉద్దానం కిడ్నీ రోగులకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆసుపత్రి నిర్మిస్తున్నామని వెల్లడించారు. వంశధార ప్రాజెక్టు అడ్డంకులు అధిగమిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఒడిశా సీఎంతో మాట్లాడినట్లు తెలిపారు.

10,185 గ్రామ సర్వేయర్లు, 3,664 వార్డు ప్లానింగ్ సెక్రటరీల, రూ. 1000 కోట్ల వ్యయం, 4,500 సర్వే బృందాలు, ఎయిర్ క్రాఫ్టులు, హెలికాప్టర్లు, డ్రోన్లు, 70 కార్స్ బేస్ స్టేషన్లు, 2,000 రోవర్ల ద్వారా అత్యాధునిక సాంకేతికలతో రీసర్వే చేయబడుతుంది. ప్రతి భూకమతాన్ని సర్వే చేసి అత్యంత కచ్చితత్వంతో అక్షాంశ, రేఖాంశాలు, గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు QR కోడ్ తో కూడిన భూ కమత పటం భూ యజమానులకు జారీ చేస్తాం. ప్రతి స్థిరాస్తికీ ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత పత్రం ఇస్తాం’’ అని జగన్ చెప్పారు.

‘‘జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల సంఖ్య కేవలం 295, మండల సర్వేయర్ల సంఖ్య కేవలం 676.. సర్వే, మ్యూటేషన్, ఇతరత్రా రిజిస్ట్రేషన్ సేవల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే దుస్థితి, లంచాలు, వివక్ష. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో భూ రికార్డులన్నీ క్రోడీకరించి తయారు చేసిన (భూ కమతాలతో కూడిన గ్రామ పటం), ఇతర భూ రికార్డులు ఇక గ్రామాల్లోనే అందుబాటు లోకి తెచ్చింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us