వైభవంగా సత్యదేవుడి జన్మనక్షత్ర పూజలు

అన్నవరం (రెడ్ బీ న్యూస్) 31 అక్టోబర్ 2021: సత్యదేవుడి జన్మనక్షత్రం మఖ సందర్భంగా ఆదివారం మూలవిరాట్‌లకు ప్రత్యేకపూజలు, పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున రెండుగంటలకు స్వామి, అమ్మవార్లను సుప్రభాతసేవతో మేల్కొలిపి అభ్యంగనస్నానమాచరింప చేశారు. అనంతరం పంచామృతాలతో అభిషేకించి నూతన పట్టువస్ర్తాలను ధరింపచేసి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలను ప్రధానార్చకులు కోట శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం యాగశాలలో ఆయుష్యహోమం ప్రారంభించి 11గంటలకు హోమగుండంలో సుగంద ద్రవ్యాలను అర్పించి పూర్ణాహుతి గావించారు. కార్యక్రమంలో ఈవో త్రినాథరావు, చైర్మన్‌ ఐవీ రోహిత్‌ తదితరులు పాల్గొన్నారు. సత్యదీక్షలు స్వీకరించిన భక్తులు.. ప్రతీఏటా ఆశ్వీయుజ మాసంలో వచ్చే మఖ నక్షత్రం రోజున ప్రారంభమై కార్తీకమాసంలో వచ్చే మఖ నక్షత్రం రోజుతో ముగిసే సత్యదీక్షలను ఆదివారం భక్తిశ్రద్ధలతో భక్తులు స్వీకరించారు. గిరిజన ప్రాంతంలో సుమారు 500 మందికి ఉచితంగా దీక్షా వస్త్రాలను దేవస్థానం అందించారు. అన్నవరం పరిసర ప్రాంతాల్లో సుమారు వెయ్యిమంది ఆయా గ్రామాల ఆలయాల్లో దీక్షలను స్వీకరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us