CM Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై దాడి చేసిన యువకుడు

UPDATED 27th MARCH 2022 SUNDAY 08:40 PM

Bihar CM Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్‌కుమార్ సెక్యూరిటీలో లోపం బయటపడింది. సీఎం నితీశ్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై ఓ యువకుడు దాడి చేశాడు. పాట్నా సమీపంలోని భక్తియార్‌పూర్‌లో జరిగిందీ ఘటన.

భక్తియార్‌పూర్ పర్యటనలో ఉన్న సీఎం నితీశ్‌ను ఓ యువకుడు టార్గెట్‌గా చేసుకున్నాడు. ఓ విగ్రహానికి సీఎం నివాళులర్పిస్తుండగా.. సెక్యూరిటీని దాటుకుని వెళ్లి మరీ దాడి చేశాడు. బిత్తరపోయిన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకునేందుకు యత్నించారు.అయినా యువకుడు వినకుండా సెక్యూరిటీని తోసుకుని వెళ్లి దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us