జగ్గంపేటకు ముఖ్యమంత్రి వరాల జల్లు

UPDATED 15th AUGUST 2017 TUESDAY 9:00 PM

జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం ప్రారంభించిన అనంతరం జగ్గంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన చంద్రబాబు మాట్లాడుతూ అడిగినవన్నీ చేస్తానని హామీ ఇచ్చారు. జగ్గంపేట పరిధిలో 10 గ్రామాలు రైతులకు ఏలేరు కుడి కాలువ ద్వారా సాగునీటిని అందించేందుకు రూ.26 కోట్లతో పనులు చేపట్టాలని ఎమ్మెల్యే కోరగా తక్షణం నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. జగ్గంపేటలో సుమారు రెండు వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతుండడంపై తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పుష్కర ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరమ్మతులు చేయించి చివరి ఆయకట్టు రైతుకు కూడా సాగునీటిని అందిస్తామన్నారు. జగ్గంపేటలో డ్రైనేజీ, సిమెంటు రోడ్ల నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కిర్లంపూడిలో డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరగా రాష్ట్రంలో కొత్తగా వీటిని ఏర్పాటు చేస్తే తొలుత కిర్లంపూడిలోనే ప్రారంభిస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జల వనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కాకినాడ ఎంపీ తోట నరసింహం తదితరులు పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us