Andhra Pradesh: సూపర్ స్టార్ రజనీకాంత్‌పై కొడాలి నాని, మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

Updated 29th April 2023 Saturday 11:25 am

Andhra Pradesh:  నందమూరి తారాక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. రజనీకాంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీలో జీరో అయిన రజినీకాంత్, సిగ్గుశరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నాడంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజినీకాంత్‌ను చంద్రబాబు రంగంలోకి దించాడని, చంద్రబాబు రాజకీయాలను ఇకనైనా పవన్ కళ్యాణ్ గ్రహించాలని కొడాలి నాని సూచించారు.

ఎన్టీఆర్‌పై చెప్పులు విసురుతుండగా వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతు  తెలిపిన రజినీకాంత్.. ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగడడం సిగ్గుచేటు అన్నారు. వెధవలంతా ఒకచోట చేరి చేస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ప్రజలేవరూ పట్టించుకోరని కొడాలినాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్టీఆర్ బతికుండగా రజినీకాంత్ ఏం చేశాడు..? ఇప్పుడేం మాట్లాడుతున్నాడు అంటూ నాని ప్రశ్నించారు. మూడు రోజులు షూటింగ్ చేస్తే.. నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండే రజినీకాంత్ తెలుగు ప్రజలకేం చెప్తాడని కొడాలి నాని ఘటుగా విమర్శలు చేశారు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రజినీకాంత్ చదువుతూ తను వ్యక్తిగా మరింత దిగజారుతున్నాడంటూ నాని అన్నారు.

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్ ..

ఏపీ రాజకీయాల గురించి రజనీకాంత్‌కి ఏం తెలుసు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. సినిమాల్లో సూపర్ స్టార్ కావచ్చు. ఏపీ రాజకీయాల్లో మాత్రం ఆయనకు అవగాహన లేదని అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు వైస్రాయ్ హోటల్‌లో చంద్రబాబుకి మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ వెంటిలేటర్‌పై టీడీపీకి మద్దతు కోసం తీసుకుని వచ్చాడు అంటూ విమర్శించారు. 2047లో ఏదో చేస్తారని రజనీకాంత్ చెప్తున్నాడు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడు. ఐదేళ్లు అమరావతిలో టెంపరరీ కట్టడాలు కట్టి అభివృద్ధి చేయకుండా ఉన్నది రజినీకాంత్ కి తెలియదా అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు

 

 

 

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us