రాష్ట్ర మహాసభలకు తరలివెళ్లిన సిపిఎం నాయకులు

UPDATED 10th FEBRUARY 2018 SATURDAY 5:00 PM

సామర్లకోట: ఉద్యమాల గడ్డ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న 25వ రాష్ట్ర సిపిఎం మహాసభలకు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణం నుంచి సీపీఎం నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక కార్యకర్తలు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఈ మహాసభలకు సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్, బి.వి. రాఘవులు వంటి అతిరథ,మహారథులు పాల్గొంటారని, రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా విజయవాడలో రాష్ట్ర మహాసభలు జరిగాయని, ఆ తర్వాత ఇప్పుడు భీమవరంలో జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బాలం శ్రీనివాస్, తుంపాల శ్రీనివాస్, విప్పర్తి కొండలరావు, కరణం గోవింద్, బత్తుల బాలాజీ, యువరాజు, బాలం సత్తిబాబు, దారబాని కృష్ణ, వీరబాబు, కరణం శ్రీనివాసరావు, బాలం హరి, ఏసురాజు, తదితరులు పాల్గొన్నారు..
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us