UPDATED 14th NOVEMBER 2022 MONDAY 6:50 PM
Yashoda: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటించిన తాజా చిత్రం ‘యశోద’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ టాక్‌ను తెచ్చుకుంది. సమంత ఈ సినిమాను తన భుజాలపై మోసిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఈ సినిమాలోని సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమాకు రెస్పాన్స్ అదిరిపోయింది.
సరోగసీ నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ సినిమాలో సమంత ఎలాంటి పాత్రలో నటిస్తుందా అని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు వారు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తొలిరోజే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు కూడా బాగా వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ వారం యశోద ఒక్కటే బిగ్ మూవీ కావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.







