Crime News: టీడీపీ నేత తిక్కారెడ్డిపై వైసీపీ వర్గీయుల దాడికి యత్నం: ఐదుగురికి గాయాలు

మంత్రాలయం (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: కర్నూలు జిల్లా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ బాధ్యుడు తిక్కారెడ్డిపై వైకాపా వర్గీయులు దాడికి యత్నించారు. కోసిగి మండలం పెద్దభూంపల్లిలో జరుగుతున్న ఆంజనేయస్వామి రథోత్సవంలో కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఒక్కసారిగా వైకాపా వర్గీయులు దాడికి యత్నించడంతో తెదేపా కార్యకర్తలు తిక్కారెడ్డిని కాపాడారు. ఈ ఘటనలో ఐదుగురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో మంత్రాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: లోకేశ్‌ తిక్కారెడ్డిపై హత్యాయత్నా్న్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు. గతంలో తిక్కారెడ్డిపై హత్యాయత్నం జరిగినా భద్రత కల్పించలేదన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us