సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యలు తీసుకోవాలి

UPDATED 14th JUNE 2018 THURSDAY 9:00 PM

రంపచోడవరం: గిరిజన ప్రాంతాలలో కాళ్లవాపు, మలేరియా, డయేరియా వంటి తదితర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ కారెం శివాజీ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా గురువారం ఆయన తనిఖీ చేసారు. తొలుత రోగుల వార్డులు, బాలింతలు, గర్భిణీల వార్డులు, రక్త నిధి కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించారు. అలాగే అక్షయ పిల్లల ఆరోగ్య పునర్జీవ కేంద్రంలో పిల్లలకు కల్పిస్తున్న వసతులను, నవజాత శిశువుల వార్డులను, కంటి వైద్యకేంద్రాన్ని పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో పరిశుభ్రత లోపించిందని, రోగులకు వార్డులలో ఉపయోగించే దుప్పట్లు అధ్వాన్నంగా ఉన్నట్లు గుర్తించామని, వీటి నిర్వహణను మెరుగుపర్చాలని ఆదేశించామన్నారు. రోగుల తాకిడికి అనుగుణంగా ఆసుపత్రిలో పడకలు లేవని 100 పడకల ఆసుపత్రిగా త్వరలో మార్చుచేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.  చిన్న పిల్లల వైద్యులను నియమించడానికి, ఐ.సి.యు ఏర్పాటుకు వైద్యుల కొరతను అదిగమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రి పూర్తిస్థాయిలో రోగులకు అవసరమైన వసతులు లేవని గుర్తించి, వాటిని  నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం తెల్లరేషన్ కార్డు కలిగిన ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, కమీషన్ సభ్యులు నల్లజర్ల సుధారాణి, నరహరి వరప్రసాద్, సవేరి సోమా, బి. రవీంద్ర, ఐటిడిఎ పీవోలు నిషాంత్ కుమార్, ఎం. అభిషిక్త్ కిషోర్, సబ్ కలెక్టరు వినోద్ కుమార్, జెడ్పిటీసీ, ఎంపిటిసిలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us